కాంగ్రెసుపై బాంబు పేల్చిన చిరంజీవి, సంచలన వ్యాఖ్యలు

తమను గడ్డిపోచల్లా చూస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నా తమకేమీ లేకుండా పోయిందని ఆయన అన్నారు. తమకు స్పష్టమైన హామీ కావాలని శాసనసభ్యులు అడుగుతున్నారని ఆయన అన్నారు. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల వంటివాటిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కోరుతున్నారని ఆయన అన్నారు. తమ శానససభ్యులతో తాను రేపు సమావేశం అవుతున్నట్లు ఆయన తెలిపారు. తమ శాసనసభ్యులంతా ఏకతాటిపై ఉన్నారని ఆయన అన్నారు. సహనంతో తాము ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తున్నామని, సమాజానికి సమాధానం చెప్పుకోలేని స్థితిలో తాము ఉన్నామని ఆయన అన్నారు. తమను గుర్తించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆయన అన్నారు.
శానససభ్యులకు నచ్చజెప్పుకునే విషయంలో కూడా తాను ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెసు పార్టీని కలవరానికి గురి చేస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 17 మంది ఉన్నారు. ఈ శాసనసభా సమావేశాల్లో వారు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులుగానే ఉన్నారు. ఒకవేళ కాంగ్రెసు విప్ జారీ చేసినా వారికి వర్తించదు. దీంతో తమ డిమాండ్ల సాధనకు వారు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పనికి పూనుకున్నారు.












Click it and Unblock the Notifications