జగన్ సమావేశానికి హాజరైన 22 మంది ఎమ్మెల్యేలు

పిల్లి సుభాష్ చంద్రబోస్, సుచరిత, శోభా నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, సత్యవతి, బాబూరావు, పూతలపట్టు రవి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు సమావేశానికి వచ్చారు. సమావేశానికి వచ్చిన వారిలో బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ధర్నాన కృష్ణప్రసాద్, చెన్నకేశవ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి కూడా ఉన్నారు. ప్రసాద రాజు, బాలరాజు, శివప్రసాద్ రెడ్డి, బాలనాగి రెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు.
అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఆయన వర్గానికి చెందిన కొంత మంది శాసనసభ్యులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తిడుతూ పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం సరి కాదనే వాదనను వారు ముందుకు తెస్తున్నారు. ధర్మాన కృష్ణ ప్రసాద్ మాటలను బట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. వైయస్ జగన్ ఒక్కో ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నారు. మూడు రోజుల పాటు ఆయన హైదరాబాదులోనే ఉంటారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓటేస్తే తమపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని, దానివల్ల ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న శాసనసభ్యులు అటువంటి పరిస్థితిలో ఏం చేస్తారనే విషయంపై ఎమ్మెల్యేలు జగన్‌ను స్పష్టత కోరుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications