తెలంగాణపై చంద్రబాబు మాట అదే, ఈటెల ఫైర్

పోలవరం ప్రాజెక్టు టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై తీవ్ర ఆరోణలు చేశారు. ఈ సమయంలో తెరాస శాసనసభ పక్ష నాయకుడు జోక్యం చేసుకుని చంద్రబాబుకు సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో తమ పాత్ర ఉన్నట్లు రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. రుజువు చేయలేకపోతే ముక్కు నేలకు రాస్తారా ఆయన చంద్రబాబును అడిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. పోలవరం టెండర్లలో జరిగిన అక్రమాలను రుజువు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఫైళ్లను స్పీకర్ వద్ద పెట్టాలని చంద్రబాబు అంతకు ముందు అన్నారు. పోలవరం టెండర్ల అక్రమాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ఎత్తిన ఓ నాయకుడి పేరును స్పీకర్ అనుమతించలేదు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడవద్దని స్పీకర్ చంద్రబాబుకు సూచించారు.
ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. సీట్లలోంచి లేచి ఆందోళన వ్యక్తం చేశారు. వారు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. చంద్రబాబుకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చానని, వెళ్లి కూర్చోవాలని ఆయన చెప్పారు. చంద్రబాబు తెరాసను ప్రస్తావించారు కాబట్టి ఈటెల రాజేందర్‌కు అవకాశం ఇచ్చానని, తెలుగుదేశం సభ్యులకు అవకాశం ఇచ్చేది లేదని ఆయన చెప్పారు. తెలుగుదేశం సభ్యులు తన మాట వినకపోవవడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications