రాష్ట్రాన్ని లూటీ చేశారు: వైయస్‌ను టార్గెట్ చేసిన బాబు

ys rajasekhar reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పాలనతో పాటు వైయస్‌పై కూడా తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. దివంగత వైయస్ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని విమర్శించారు. వైయస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల సభ్యులను లాక్కుంటే ఇప్పటి సిఎం ఆపరేషన్ స్వగృహ చేపట్టారని విమర్శించారు. వైయస్ ఉన్నప్పుడు చేసిన పనులకు ఇప్పుడు రాష్ట్రం అనుభవిస్తుందన్నారు. నాడు వైయస్ లూటీ చేస్తుంటే మంత్రివర్గం సహకరించిందని విమర్శించారు.

వైయస్ తన హయాంలో రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టారన్నారు. సెజ్‌ల పేరుతో సాగు భూమిని పరిశ్రమలకు అప్పగించి రైతులకు అన్యాయం చేశారన్నారు. ఆయన హయాంలోనే రాష్ట్రంలో మైనింగ్ మాఫియా వెలుగులోకి వచ్చిందన్నారు. మైనింగ్, పరిశ్రమలు, పథకాల పేరుతో రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేశారని ధ్వజమెత్తారు. వైయస్ అక్రమాలపై ఆయన బతికున్న సమయంలోనే రాజా ఆఫ్ కరప్షన్ పేరుతో పుస్తకం వేసి జాతీయస్థాయిలో పంచి పెట్టామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+