సిఎంపై హరీష్ రావు ధ్వజం, మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్

దివంగత వైయస్ హయాంలో నిధులు కడపకు తరలితే కిరణ్ హయాంలో అన్నీ చిత్తూరుకు వెళుతున్నాయన్నారు. మరి తెలంగాణకు ఎప్పుడు నిధులు వస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యార్థులపై, ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. తెలంగాణ వారిని అన్ని రంగాల్లో సెకండరీ గ్రేడ్‌గానే చూస్తున్నారన్నారు. సిఎం పథకాలపై తీసుకున్న నిర్ణయం సంబంధింత మంత్రులకు కూడా తెలియకుండా జరుగుతుందన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు ధీటుగా స్పందించారు. టిఆర్ఎస్ ఏం చెబితే అది మాట్లాడని వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ కోసం మేం ప్రభుత్వంలో ఉండి అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తున్నామని సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కనీస అవసరాలు తీర్చే ఉద్దేశ్యంలో భాగంగా రూపాయికి కిలో బియ్యం మొదటి అడుగు అన్నారు.
అంతకుముందు వైయస్ విజయమ్మ వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. జగన్ సిఎం సీటు కోసం ఎంతగా ప్రయత్నించారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. వైయస్ మృతదేహం పక్కనుండగానే సిఎం సీటు కోసం ఎంతగా ప్రయత్నాలు చేశారో అందరికీ తెలుసున్నారు. లక్షకోట్ల అవినీతికి పాల్పడిన మీరు ఇప్పుడు మమ్మల్ని కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లినప్పటి నుండి ఇదే మాట మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications