బాబుది సొల్లు, నిరూపిస్తే మేం ఉరికి సిద్దం: కెటిఆర్

చంద్రబాబు తమపై నిరాధారమైన, దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మాట్లాడేది సొల్లు కాకపోతే, ఆ ఆరోపణలపై ఏ విచారణ చేయించుకోవాలని ఆయన అన్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని, ఆరోపణలు రుజువైతే తాము ఉరి శిక్ష వేసుకుంటామని ఆయన అన్నారు. చంద్రబాబుకు కృష్ణ జన్మస్థానం తప్పదని, చిప్పకూడు తప్పదని ఆయన అన్నారు. సిబిఐ విచారణను ఎదుర్కోలేకనే తమపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తెలంగాణలో భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతోనైనా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని సంస్థలతోనైనా విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. చంద్రబాబు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుది ఇప్పటికే రోడ్డు బతుకు అయిపోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications