కాంగ్రెసు పెద్దలకు చిరంజీవి వర్గం నేత హెచ్చరిక

కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తర్వాత కింది స్థాయిలో పొరపొచ్చాలు, అపోహలు ఉండడం సహజమని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. చిరంజీవి అనుచరులు, అబిమానులు, ఓటర్లు కాంగ్రెసు పార్టీకి బలం చేకూరుస్తారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనతోనే చిరంజీవి ఒత్తిడి రాజకీయాలకు పూనుకుని, కాంగ్రెసు అధిష్టానం ద్వారా తన డిమాండ్లను సాధించుకునే ప్రయత్నం చేశారు. ఇక ముందు కూడా అదే వైఖరిని అవలంబించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు రామచంద్రయ్య మాటలను బట్టి అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications