విజయం కిరణ్ కుమార్ రెడ్డిదే, వీగిన అవిశ్వాసం

అవిశ్వాసానికి వ్యతిరేకంగా 160 ఓట్లు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. తెలుగుదేశం సభ్యులు 85 మంది, టిఆర్ఎస్ సభ్యులు 11 మంది, సిపిఐ సభ్యులు నలుగురు, బిజెపి సభ్యులు ఇద్దరు, సిపిఎం సభ్యుడు ఒకరు, స్వతంత్ర సభ్యుడు ఒకరు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. ఒకరు తటస్థంగా ఉండగా, ముగ్గురు సభకు గైర్హాజరయ్యారు. గైర్జారైనవారిలో ఒకరు టిఆర్ఎస్ సభ్యుడు, ఒక మజ్లీస్ సభ్యుడు, జగన్ వర్గం ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవడానికి 143 ఓట్లు అవసరం కాగా, 161 ఓట్లు వచ్చాయి. సాధారణ మెజారిటీ కన్నా ప్రభుత్వానికి 17 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ప్రభుత్వానికి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 17 మంది, మజ్లీస్ సభ్యులు ఆరుగురు మద్దతిచ్చారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటా 10 నిమిషాల సమయంలో ఓటింగ్ జరిగింది. జయసుధ ప్రభుత్వానికి మద్దతు పలికారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించిన తర్వాత స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications