చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ ముమ్మరం

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తీసుకున్న మంత్రి వర్గ నిర్ణయాలపై సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. సచివాలయంలోని పలు శాఖల నుంచి సిబిఐ అధికారులు సమాచారం సేకరించారు. ఇందుకు గాను గత మూడు రోజులుగా సిబిఐ అధికారులు సచివాలయంలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆస్తుల కేసులో రెడ్డీ ల్యాబ్స్‌కు సిబిఐ నోటీసు జారీ చేసింది. దానికి రెడ్డీ ల్యాబ్స్ వివరణ కూడా ఇచ్చింది. కాగా, చంద్రబాబు దాఖలు చేసుకున్న వెకేట్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు ఆస్తుల కేసులోనే ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావు దాఖలు చేసుకున్న వెకేట్ పిటిషన్‌పై విచారణ ముగిసింది.












Click it and Unblock the Notifications