వైయస్ జగన్‌ను తేలికగా కొట్టిపారేసిన కిరణ్ రెడ్డి

జగన్ వర్గానికి చెందిన 17 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేస్తే జరిగే ఉప ఎన్నికల్లో జయాపజయాల గురించి ఆయన ప్రస్తావించారు. జగన్ పార్టీ అభ్యర్థులు పూర్తిగా 17 సీట్లను గెలుచుకునే అవకాశాలు లేవని, జగన్ పట్ల ప్రజల్లో సానుభూతి తగ్గిందని, ఈ విషయం సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి అన్నారు. తమ ప్రధాన ప్రత్యర్థులు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలేనని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరిగితే 17 సీట్లను తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు గెలుచుకునే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ కుమారుడిగా జగన్ పట్ల సానుభూతి చూపాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన 17 మంది శానససభ్యులపై అనర్హత వేటుకు చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications