బాబు కేసులో నావాదనలు వినండి:కోర్టుకు లక్ష్మీపార్వతి

రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే చంద్రబాబు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టి, పలు కంపెనీలు ఏర్పాటు చేసారని, ఇదంతా చట్టబద్ధంగా సంపాదించింది కాదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. బాబు ఆస్తులపై విచారణ జరపాలని కోరుతూ తాను గతంలోనే ఎసిబికి ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించక పోవడంతో ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశానని చెప్పారు. తదనంతరం బాబుపై తాను వేసిన పిటిషన్‌పై విచారణ 2005 నుండి కొనసాగుతూనే ఉందని అందులో పేర్కొన్నారు. బాబు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని చెప్పారు. ప్రస్తుతం నాకు రాష్ట్ర ప్రభుత్వం, దాని దర్యాఫ్తు సంస్థలపై నమ్మకం లేకే సిబిఐ చేత విచారణ చేయించాలని కోరుతున్నట్లు కోర్టుకు విన్నవించారు.












Click it and Unblock the Notifications