జగన్‌తో కుమ్మక్కు కావాల్సిన ఖర్మ పట్టలేదు: కెటిఆర్

తెలంగాణ ప్రాంత శాసనసభ్యులకు తాము బహిరంగంగానే విజ్ఞప్తి చేశామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి భవిష్యత్తును కాపాడుకోవాలని తాము సూచించామని, అదే తాము ప్రలోభాలకు బహిరంగంగా ప్రలోభ పెట్టిన అంశమని ఆయన అన్నారు. సామాజిక తెలంగాణ అంటూ, కాంగ్రెసు నాయకులను పంచెలూడదీసి కొడుతామంటూ మాట్లాడిన చిరంజీవి కాంగ్రెసులో కలిసిపోయారని ఆయన అన్నారు.
తమ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ సుధాకర్‌ను విడుదల చేయాలని రాష్టర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. చెరుకు సుధాకర్‌ను విడుదల చేయాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుధాకర్‌పై నాసాను ప్రయోగించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. సుధాకర్‌కు 12 నెలల నిర్బంధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుధాకర్‌కు నిర్బంధం విధించాలని సూచించిన కమిటీలో సీమాంధ్రులే ఉన్నారని, వారు కూడా ప్రాంతీయ మనోభావాలకు అనుగణంగానే సుధాకర్‌పై సలహా ఇచ్చారని కెటి రామారావు అన్నారు.












Click it and Unblock the Notifications