వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు మళ్లీ గెలుస్తారా?

వాటిలో అత్యధిక స్థానాలు సీమాంధ్రలోనే ఉన్నాయి. ఏడు స్థానాలు తెలంగాణకు సంబంధించినవి. తెలంగాణను వదిలేస్తే సీమాంధ్రలో జరిగే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థులుగా అనర్హత వేటుకు గురయ్యే శాసనసభ్యులు పోటీ చేసి సత్తా చాటుతారని అంటున్నారు. మెజారిటీ స్థానాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంటుందని చెబుతున్నారు. ఆ నమ్మకంతోనే వైయస్ జగన్ ఉన్నారు. వారిని తాను గెలిస్తానని కూడా హామీ ఇచ్చారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సత్తా చాటుతుందని అంటున్నారు. వైయస్ జగన్ మాత్రం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను మట్టి కరిపించాలనే కసితో ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా, అన్ని స్థానాలకూ ఒకేసారి ఎన్నికలు వస్తే పరిస్థితి పూర్తిగా తనకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఓటమి భయంతోనే తన వర్గం శాసనసభ్యులపై అనర్హత వేటు వేయడంలో కాంగ్రెసు పార్టీ మీనమేషాలు లెక్కిస్తోందని వైయస్ జగన్ అంటున్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని ఆయన అనుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ ఉప ఎన్నికను ఎదుర్కున్నట్లుగానే ఈ ఉప ఎన్నికలను కూడా ఎదుర్కుని తమ బలం ఎంత ఉందో తేల్చువాలనే ఆలోచనలో కాంగ్రెసు పెద్దలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతే దాని ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని చెబుతున్నారు. ఏమైనా, పరిస్థితి ఇప్పుడు మాత్రం జగన్‌కు అనుకూలంగా ఉందనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications