సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ, ఆజాద్ కూడా

సోనియాతో సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్ కలిసి బయటకు వెళ్లిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఆజాద్ తన నివాసానికి తీసుకుని వెళ్లారు. ఆజాద్ తన నివాసంలో కిరణ్ కుమార్ రెడ్డితో మరో దఫా చర్చలకు దిగారు. వారిద్దరు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసే అవకాశం ఉంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. ఈలోగా ముఖ్యమంత్రితో కాంగ్రెసు అధిష్టానం చర్చలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉంది. బొత్స సత్యనారాయణతో చర్చలు జరిపిన అనంతరం వివిధ విషయాలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ అంశాన్నితేల్చిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆజాద్ శుక్రవారం చెప్పారు. దీంతో తెలంగాణ అంశంపై సీరియస్‌గానే అధిష్టానం వర్గం పెద్దలు ముఖ్యమంత్రితో చర్చించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications