ప్రశ్నిస్తే దాడి: జగన్‌పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

revanth reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జర్నలిజం ముసుగులో జగన్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు. అవినీతిని ప్రశ్నించిన వారిపై జగన్ తన మీడియాతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు కలుగుతోందన్నారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై ఎదురు దాడి చేస్తున్న ఆయన మీడియాను అడ్డుకోవాలన్నారు. ఆయన తీరు ప్రజాస్వామ్యానికే విఘాతమన్నారు. వైయస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిని తన పార్టీలో జగన్ చేర్చుకున్నారనని ఇది ఏ రకమైన రాజకీయ విలువలకు నిదర్శనమో చెప్పాలన్నారు.

ప్రశ్నిస్తే తన మీడియాతో దాడి చేయడం జగన్‌కు అలవాటుగా మారిందన్నారు. టిడిపి అవిశ్వాసం పెడితే ప్రభుత్వాన్ని పడగొడతానని తొడలు కొట్టి ఇప్పుడు నీ ఎమ్మెల్యేలను కాంగ్రెసుకు అమ్ముకున్నావని విమర్శించారు. నీవు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే తప్పులేదు కాంగ్రెసు కొనుగోలు చేస్తే తప్పా అని ప్రశ్నించారు. కాంగ్రెసు, జగన్ కుమ్మక్కై ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెసు, జగన్ సంతలో జంతువులను కొన్నమాదిరిగా ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు. జర్నలిజంను అపహాస్యం చేసిన ఘనత జగన్‌దేనన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+