మద్దెలచెర్పు సూరి గ్యాంగ్‌తో నిమ్స్ డాక్టర్‌కు లింక్స్

డాక్టర్ శరత్ ప్రసాద్ పరారీలో ఉన్నాడని, అతని మొబైల్ పని చేయడం లేదని సిఐడి తన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. జంట హత్యకేసులో నిందితుడు జైరాం రెడ్డికి రక్షణ కల్పించాడనే ఆరోపణలపై శరత్ ప్రసాద్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. మధు మోహన్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. సూరి హత్య కేసులో మధుమోహన్ రెడ్డిని సాక్షిగా భావిస్తున్నారు. వ్యాపారి వి. సుధీర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు మధుమోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. తన అస్తులను లాక్కోవడానికి భాను కిరణ్, మధు మోహన్ రెడ్డి, డాక్టర్ శరత్ ప్రసాద్, సూరి సోదరి కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.
సూధీర్ రెడ్డి చెప్పిన ఆస్తుల్లో పులిమామిడిలో నాలుగు ప్లాట్లు, కేశవరంలోని పెండ్యాలలో 5.17 ఎకరాల భూమి ఉన్నాయి. ఆ భూమిని సుధీర్ రెడ్డి విష్ణువర్ధన్ రావు నుంచి కొన్నారు. తన వాటా భూమిని లాక్కోవడానికి విష్ణువర్ధన్ రావు మాఫియాను వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications