సకల జనుల సమ్మె నుండి కోలుకోలేదు: సిఎం కిరణ్

సమస్యలు ఏవైనా సమన్వయంతో ఎదుర్కోవాలన్నారు. ఉద్యోగల భర్తీకి నెలాఖరులోగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలు లంచం లేకుండా అర్హులకు చేరేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పని చేయాలని, రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దాలని సూచించారు. మైక్రో ఫైనాన్స్ విషయంలో ముందుగా మేల్కొని ఉంటే బాగుండేదన్నారు. నీటిపారుదలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ రైతులకు సమృద్ధిగా నీరు అందించలేక పోతున్నామన్నారు. కిలో బియ్యం పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కలెక్టర్లకు వివరించారు.












Click it and Unblock the Notifications