జగన్ సాక్షి మీడియాపై ఫిర్యాదుకు సిద్ధమైన టిడిపి?

ఈ అంశాలన్నింటినీ తీసుకొని ఫిర్యాదు చేసి కట్టడి చేయాలని టిడిపి నిర్ణయించింది. తమపై కేవలం ఉద్దేశ్య పూర్వకంగానే సాక్షి వ్యతిరేక కథనాలు రాస్తోందని టిడిపి నేతలు భావిస్తున్నారు. వారు పలుమార్లు సాక్షి పత్రికపై ప్రెస్ మీట్‌లలోనే విరుచుకు పడ్డారు. ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వర రావు ఏకంగా లోక్‌సభలోనే సాక్షి ఛానల్‌పై ఫైర్ అయ్యారు. మనీలాండరింగ్‌కు పాల్పడి అవినీతి సొమ్ముతో సాక్షి ఛానల్ ప్రారంభించారని సభలో కేబుల్ నెట్ వర్క్ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంలో ఆయన మంగళవారం అన్నారు.












Click it and Unblock the Notifications