బాబుకు స్టే వర్తించదు: హైకోర్టులో విజయమ్మ లాయర్

హైదరాబాద్: హైకోర్టు మంగళవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వర్తించవని పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తరఫు న్యాయవాది బుధవారం కోర్టులో వాదించారు. రామోజీ రావు, నామా నాగేశ్వర రావు, కెవి రావులు మాత్రమే సుప్రీంకు వెళ్లారని, అలాంటప్పుడు నిన్నటి ఉత్తర్వులు వీరి ముగ్గురికే వర్తిస్తాయని, బాబు సహా మిగిలిన ప్రతివాదులకు వర్తించవన్నారు. బాబుపై సిబిఐ విచారణ కొనసాగనివ్వాలని కోరారు. ప్రతివాదులందరిపై విచారణ ఆపడం సహజ న్యాయసూత్రాలకు విరుద్దమన్నారు.

విచారణ అందరిపై ఆపేస్తే తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందన్నారు. అయినా ప్రజాకోర్టులో తేల్చుకుంటామన్నచంద్రబాబు ఇప్పుడు కంగారు పడుతూ కోర్టుకు ఎందుకు వచ్చారన్నారు. సిబిఐ, ఈడి దర్యాఫ్తు కలిపి సాగుతుందని, పోలీసులూ సహకరిస్తారని, దర్యాఫ్తు సంస్థలు వేధించవని ఇలాంటి సమయంలో విచారణ నిలిపి వేయకుండా ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలన్నారు. సిబిఐ విచారణ జరిపి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇస్తుందని అలాంటప్పుడు వారికి అభ్యంతరమెందుకన్నారు.

విచారణకు ఆదేశించి నెల అయిందని ఇప్పటి వరకు ఎవరూ ఇబ్బందులు పడలేదని అలాంటప్పుడు విచారణ ఆపేయడం సరికాదన్నారు. కేసులో లక్ష్మీ పార్వతి ఇంప్లీడ్ కావడాన్ని రామోజీ రావు తరఫు న్యాయవాది తప్పు పట్టగా జగన్ కేసులో టిడిపి నేతలు ఇంప్లీడ్ అయినట్టే ఇప్పుడు ఇంప్లీడ్ అయ్యారని విజయమ్మ తరఫు న్యాయవాది చెప్పారు. విచారణకు ప్రతివాదులు ఎందుకు భయపడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+