చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐటి కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు, వేయి మంది ఖాళీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chennai Map
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని అంబత్తూర్‌లో గల ఐటి కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో దాదాపు వేయి మంది ఐటి ఉద్యోగులను ఖాళీ చేయించారు. ఐటి కాంప్లెక్స్‌లో బాంబు పెట్టినట్లు శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గుర్తు తెలియని వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఉద్యోగులను ఖాళీ చేయించి, తనిఖీలు నిర్వహించారు. ఆరు అంతస్థుల సముదాయంలోని కంపెనీల్లో ఇన్ఫో స్కైలెన్‌ రిసెప్షన్‌లోని ఓ ఉద్యోగికి ఆ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలలోగా శక్తివంతమైన ఆ బాంబు పేలుతుందని అతను చెప్పాడు.

ఇన్ఫో స్కైలెన్ అధికారులు టావో పవర్ ఇంజనీరింగ్ కంపెనీకి, టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌లకు సమాచారం అందించారు. వెంటనే ఉద్యోగులను ఖాళీ చేయించారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాంబు బెదిరింపుతో కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా భయాందోళనలు చోటు చేసుకున్నాయి.

English summary
More than 1,000 employees were evacuated from an IT complex in Ambattur near Chennai after it received a bomb threat from an unidentified person around 8.30am on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X