అది చాలా పాత వార్త: ఈడి పిలుపుపై జగన్ స్పందన

ys jagan
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి తమకు ఎలాంటి తాజా సమాచారం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం న్యూఢిల్లీలో అన్నారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన జగన్ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఆస్తుల కేసుకు సంబంధించి ఈడి విచారణకు తనను గాని, తన ప్రతినిధిని గాని హాజరు కావాలన్న విషయం చాలా పాతవార్త అన్నారు. జగన్ ఆదివారం సాయంత్రం తన సతీమణి భారతితో కలిసి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈడి పిలిస్తేనే జగన్ పార్లమెంటు సమావేశాల పేరిట ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారన్న ఊహాగానాలు రెండు మూడు రోజులుగా వినిపిస్తున్నాయి. దీంతో ఆయన ఆ వార్తలను కొట్టి పారేశారు.

కాగా జగన్ ఉదయం శీతాకాల పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్‌ను కలవనున్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకు జగన్ ఇప్పటికే 377 నిబంధన కింద లోక్‌సభలో నోటీసులు ఇచ్చారు. ఈ అంశం మంగళవారం సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+