పంతం నెగ్గించుకున్న చిరు, ముగ్గురికి పదవులు

ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులను ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు గాను కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెలాఖరున మంత్రివర్గ విస్తరణ చేపడతారని అంటున్నారు. కేవలం ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవులు కల్పించడానికే ఈ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. కోస్తా నుంచి గంటా శ్రీనివాస రావుకు, రాయలసీమ నుంచి సి. రామచంద్రయ్యకు, తెలంగాణ నుంచి అనిల్‌కు మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రజారాజ్యం పార్టీకి చెందిన వంగా గీత, బండారు సత్యనారాయణ రాజు, కన్నబాబు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసిన సి. రామచంద్రయ్యకు, గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవులు ఇస్తామని కాంగ్రెసు నాయకత్వం తేల్చి చెప్పినట్లు సమాచారం. కాగా, తెలంగాణకు చెందిన ఇద్దరు శానససభ్యుల్లో మహేశ్వర రెడ్డికి మొండిచేయి చూపే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications