మద్దెలచెర్వు సూరి హత్య వెనక మధు మోహన్?

మధు మాత్రమే సుమారు మూడు నెలల వరకు పోలీసులకు అందుబాటులో ఉన్నాడు. సూరి హత్యకు అన్నపూర్ణ ప్యాకేజింగ్ సెటిల్‌మెంట్ ప్రధాన కారణం కాగా, మధుమోహన్ వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు సాగడంతో సూరి హత్యవెనుక ఉన్న చీకటికోణాలు వెలుగులోకి రావట్లేదన్న విమర్శలు వస్తున్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. ఈ మేరకు మంగళవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. మంగలి కృష్ణ, భాను, మధుమోహన్‌రెడ్డి, ఒక మంత్రి కుమారునికి స్నేహితుడైన ప్రదీప్‌రెడ్డి 2006 నుంచే కార్పొరేట్ కంపెనీలను బెదిరించిన వైనం సైఫాబాద్ కేసుతో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మధుమోహన్‌ను ఐదేళ్ల తర్వాత సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేయడం అనుమానాలకు తావిస్తోంది. 2006లో మధుమోహన్, భాను, మంగలి కృష్ణ, ప్రదీప్‌రెడ్డి కలిసి చేసిన సెటిల్‌మెంట్లు తక్కువేమీ కావని పోలీసు అధికారులే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
కాగా, రియల్టర్ సుధీర్‌రెడ్డిని బెదిరించిన కేసులో మధుమోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్‌పై 17వ అదనపు ఎంఎస్‌జే కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సైఫాబాద్ బెదిరింపుల కేసులోనూ మధుమోహన్ బెయిల్ దరఖాస్తుపై వాదోపవాదాలు పూర్తికావడంతో తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications