ఉక్కిరి బిక్కిరవుతున్నా నన్ను తొలగించండి: శంకరరావు

మంత్రిగా తనను తొలగించాలని అధిష్టానానికి లేఖ రాస్తానని చెప్పారు. భూకబ్జాలపై పోరాటం కొనసాగిస్తానన్నారు. తాను సాధారణ వ్యక్తిగా పోరాటం చేస్తున్నానన్నారు. భూకబ్జాలపై, తనపై జరిగిన దాడిపై అధిష్టానానికి లేఖ రాస్తానన్నారు. హోంమంత్రి, ఆమె తనయుడు రౌడీలతో కలిసి తనపై దాడి చేయించారని ఆరోపించారు. భూకబ్జాలపై విచారణ జరిపాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంపై చర్యలు తీసుకోకుంటే సిబిఐ విచారణ కోరతానని హెచ్చరించారు. సబితను ఆ పదవి నుంచి తప్పించాలన్నారు. కాగా దాడి తర్వాత మంత్రికి బిపి పెరగడంతో నిమ్స్ హాస్పిటల్ తరలించి చికిత్స చేశారు.












Click it and Unblock the Notifications