మా వెంట వస్తే వారి వెంట: జెఏసి చైర్మన్ కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా వెంట ఉండేందుకు సిద్ధమైన వారి వెంటే మేం ఉంటామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శుక్రవారం అన్నారు. కేంద్రం తెలంగాణ ప్రకటన పట్ల వెనక్కి పోయిన డిసెంబర్ 23వ తేదిని తెలంగాణవాదులు విద్రోహ దినంగా ప్రకటించారు. నిరసనగా సుందరయ్య కళా భవనం నుండి ఇందిరా పార్కుకు జెఏసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. పరకాల నియోజకవర్గం విషయం ఇంకా తేలలేదని, మహబూబ్ నగర్ జిల్లా నియోజకవర్గాల విషయంలో జెఏసిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారందరికీ అండగా ఉంటామన్నారు. తమ వెంట ఎవరు వచ్చినా పార్టీలకతీతంగా వారికి మద్దతిస్తామన్నారు. తెలంగాణ సాధన కోసం స్పష్టమైన అవగాహనతో వెళుతున్నామని, ఎన్నికలు ఉద్యమంలో అంతర్భాగమే కానీ అవే లక్ష్యం కాదన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన రోజు కాబట్టి విద్రోహ దినంగా పాటిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం తెలంగాణపై నమ్మకద్రోహం చేసింది కాబట్టే సంఘటితంగా ఆందోళనలు, ర్యాలీలకు పిలుపునిచ్చామన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

సకల జనుల సమ్మె తర్వాత నిర్ణయం రావాల్సి ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాబట్టే నిర్ణయం రాలేదన్నారు. లోక్‌సభలో ఏకాభిప్రాయం అన్న అధికార పార్టీ సభ్యుల వ్యాఖ్యలపై స్పందించారు. ఏకాభిప్రాయం రావాల్సింది కాంగ్రెసు పార్టీలోనేనని అభిప్రాయపడ్డారు. వారి పార్టీలో ఏకాభిప్రాయం ఎప్పుడు వస్తుంది, తెలంగాణ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో తేల్చాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ వ్యాఖ్యలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్రం వెళుతోందని విమర్శించారు. తెలంగాణ విషయంలో నమ్మక ద్రోహానికి పాల్పడ్డ కాంగ్రెసుకు ప్రజలు గోరీ కట్టడం ఖాయమని మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. కాగా తెలంగాణలోని జిల్లాల్లో తెలంగాణవాదులు విద్రోహ దినం పాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+