జగన్, సబితలే దాడికి కారణం, చిట్టా విప్పుతా: శంకర్రావు

హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఐదువేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నగర్‌లో ఐదు ఎకరాలు ఆక్రమించారని విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న సబితను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలు బయటపెడతారని భాను కిరణ్‌ను చంపారని అనుమానం వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్రమాలు త్వరలో బయటపెడతానన్నారు. హుడా చైర్మన్‌గా ఆయన చేసిన అక్రమాలు వెల్లడిస్తానన్నారు. తనపై దాడి విషయంలో అమాయకులను అరెస్టు చేశారన్నారు.












Click it and Unblock the Notifications