కలిసిపోతున్న అంబానీ సోదరులు, తేడాలు లేవన్న తల్లి

ధీరూభాయ్ అంబానీ స్వంత పట్టణం చోర్వాడ్‌లో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. డిసెంబర్ 28వ తేదీన ధీరాభాయ్ అంబానీ 80వ జయంతి సందర్భంగా ఆయన మెమోరియల్‌ను ఇక్కడ ప్రారంభించనున్నారు. అంబానీ సోదరులిద్దరు దీనికి హాజరవుతారని భావిస్తున్నారు. ఇది తమ కుటుంబ కార్యక్రమమని, ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులంతా వస్తారని కోకిలా బెన్ అన్నారు. 2002 జులైలో ధీరూభాయ్ అంబానీ మృతి తర్వాత అంబానీ సోదరులిద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ముకేష్, అనిల్ 2006లో విడిపోయారు. వ్యాపారాలను కూడా పంచుకున్నారు.












Click it and Unblock the Notifications