గాలికి కన్నడ మంత్రి బాసట, శ్రీలక్ష్మిపై త్వరలో ఛార్జిషీట్

కాగా ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలు శ్రీలక్ష్మి పాత్రపై త్వరలో నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేయనున్నట్లు సిబిఐ మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించింది. నేరాభియోగ పత్రం దాఖలు చేయనున్నప్పటికీ ఎప్పుడు దాఖలు చేసేది చెప్పలేమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, ఓఎంసి, ఎమ్మార్ కేసులను సిబిఐ డైరెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఈ కేసులను విచారిస్తున్న జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఉన్నారు. లక్ష్మీ నారాయణ రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications