పంజా విసురుతాం, ఉద్యమాన్ని వీడేది లేదు: కెసిఆర్

తెలంగాణ రాకపోతే కట్టుబానిసలం అవుతామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర్ర ఏర్పడిన తర్వాత సింగూరు జలాలు మెదక్, నిజామాబాద్ జిల్లాలకు మాత్రమే అందేట్లు చూస్తామని ఆయన చెప్పారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్పారు. ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరు నూరైనా ఉద్యమాన్ని వీడేది లేదని, తెలంగాణ రావడం ఖాయమని ఆయన అన్నారు. మహిళలు చేస్తున్న దీక్షలను ఆయన విరమింపజేశారు.
తెలంగాణలో సీమాంధ్రుల తీరు మారలేదని, బాన్సువాడ ఉప ఎన్నిక ఓటింగు సరళి చూస్తే అది అర్థమవుతోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తేనే సీమాంధ్రులను కడుపు పెట్టుకుని దాచుకుంటామని ఆయన అన్నారు. 11 ఏళ్లుగా ఉద్యమాన్ని కాపాడుకుంటున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications