చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పొన్నం ప్రభాకర్

చంద్రబాబు పసుపు దండు గూండాలతో తెలంగాణలో దండయాత్ర చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబే బాధ్యుడని ఆయన విమర్శించారు. రైతుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పెట్టుకోవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కరీంనగర్ జిల్లాలో రైతు పోరు బాటు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ - తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారు. దీనిపైనే పొన్నం ప్రభాకర్ స్పందించారు.












Click it and Unblock the Notifications