వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విప్ ధిక్కారంపై కాంగ్రెసు సీరియస్, ఎంపీలకు షోకాజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: లోక్‌పాల్‌కు ఎన్నికల కమిషన్‌లాగా రాజ్యాంగ బద్దత కల్పించాలన్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రతిపాదనకు చుక్కెదురు కావడంతో కాంగ్రెసు పార్టీ ఓటింగ్‌కు గైర్హాజరైన తమ పార్లమెంటు సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదిహేను నుండి ఇరవై ఐదు మంది ఎంపీలు ఓటింగ్ సమయంలో గైర్హాజరైనట్లు సమాచారం. వీరికి పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రమంత్రి నారాయణ స్వామి బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ హాజరు కాని ఎంపీలకు షోకాజ్ నోటీసులు ఇస్తామన్నారు. చర్చకు హాజరు కాని ఎంపీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

విప్ జారీ చేసినప్పటికీ గైర్హాజరు కావడాన్ని తాము చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామన్నారు. అయితే కొందరు ఎంపీలు ఫోన్లు, ఎస్సెమ్మెస్‌ల ద్వారా తెలిపారన్నారు. కేంద్ర మంత్రి పవర్ కుమార్ బన్సాల్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఓటింగుకు గైర్హాజరైన ఎంపీలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. కాగా మన రాష్ట్రం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి గైర్హాజరయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరు కాలేదని కోమటిరెడ్డి వివరణ పంపగా, రాజీనామా చేసిన కారణంగా మేకపాటి హాజరు కాలేదని సమాచారం.

టిడిపికి చెందిన ఆరుగురు ఎంపీలు చర్చలో పాల్గొని ఓటింగుకు హాజరు కాలేదు. టిఆర్ఎస్ ఎంపీలు కెసిఆర్, విజయశాంతి, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి లోక్‌పాల్ బిల్లు చర్చలో పాల్గొనలేదు.

కాగా బుధవారం రాజ్యసభకు రావాల్సిన లోక్‌పాల్ బిల్లు గురువారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగువ సభ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేస్తేనే ఎగువ సభలో ప్రవేశ పెట్టవలసి ఉంటుంది. ప్రతిభా పాటిల్ హైదరాబాదులో ఉన్నందున ఆమోదించిన బిల్లును బుధవారం హైదరాబాద్ పంపి సంతకం చేయించి గురువారం రాజ్యసభలో ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
With Rahul Gandhi being the prime mover behind granting constitutional status to the Lokpal, the Congress party is clearly upset for not being able to secure it in Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X