హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి దోచుకుంది రూ.5194కోట్లు: ఛార్జిషీట్‌లో సిబిఐ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి గనుల దోపిడిని సిబిఐ రూ.5194 కోట్లుగా లెక్కకట్టింది. ఇందులో ఇనుప ఖనిజం స్థానిక విక్రయాలు, ఎగుమతుల ద్వారా రూ.4310.20 కోట్లు, ఇది కాకుండా లీజు పొందిన గనుల ద్వారా 884.13 కోట్లు దోచుకున్నారని సిబిఐ తన కోర్టుకు సమర్పించిన తమ ఛార్జిషీటులో పేర్కొంది. ఓఎంసి అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ 186 పేజీలతో డిసెంబర్ 3న ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. దానికి కోర్టు సిసి నెంబర్ 1/2012 కేటాయించింది. ఓఎంసి కేసు విచారణ ఈనెల 12వ తేదీ నుంచి సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. అదే రోజు నిందితులకు ఛార్జిషీటు ప్రతులను అప్పగించనుంది. శ్రీలక్ష్మిపై ఇంకా దర్యాఫ్తు కొనసాగుతోందని, త్వరలో అదనపు ఛార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు సిబిఐ తెలిపింది.

అనంత జిల్లాలోని ఓబుళాపురం, సిద్ధాపురం, మలపనగుడి ప్రాంతాల్లో మొత్తం ఆరు లీజులు మంజూరు కాగా మూడు లీజులు ఓంసికి దక్కాయని, 2001 అక్టోబరు 29న ఓఎంసి ఏర్పాటైందని, అయితే 2002 మే 2న గాలి, మరో ఐదుగురు డైరెక్టర్లుగా ఓఎంసిని స్వాధీనం చేసుకున్నారని ఛార్జిషీటులో పేర్కొంది. శ్రీనివాస్ రెడ్డి 2003లో డైరెక్టర్‌గా చేరారని, ఆ తర్వాత 2005లో రాజగోపాల్ బావమరిది రాజశేఖర్ డైరెక్టర్‌గా చేరారని పేర్కొన్నారు. 2007లో రాజశేఖర్ రాజీనామా చేసినప్పటికీ ఆ తర్వాత కూడా డైరెక్టర్ హోదాలో సంతకాలు చేస్తూ వచ్చారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఓఎంసి ఇనుప ఖనిజాన్ని తరలించిందని పేర్కొంది.

ఛార్జిషీటులో బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, విడి రాజగోపాల్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, ఆఱ్.లింగారెడ్డిలను నిందితులుగా సిబిఐ పేర్కొంది. ఐపిసి 120బి, 420, 409, 468, 471 తదితర అభియోగాలు మోపింది. అలాగే పలు మైనింగ్ కంపెని బాధితులను సాక్షులుగా పేర్కొంది.

English summary
The CBI stated in its chargesheet against former Karnataka minister Gali Janardhan Reddy that he get rs.5194 crores with mining.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X