కిరణ్‌పై దండెత్తిన దామోదర, ఢిల్లీకి పిలువు

చిరంజీవిని కూడా అడ్డుకుంటూ ఆయన ముఖ్యమంత్రిని ఉతికి ఆరేసినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి సరైన దిశ నిర్దేశించకపోవడంతో తనతో పాటు పార్టీ కార్యకర్తలంతా అయోమయంలో ఉన్నారని ఆయన విమర్శించారు. మంత్రులకు కూడా చెప్పకుండానే ముఖ్యమంత్రి పథకాలను ప్రవేశపెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల విషయంలో కూడా ముఖ్యమంత్రిని ఆయన నిలదీశారు. తాను ఒక్క సెజ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి చెప్పగా, ఇప్పటికే 23 ఆర్థిక మండళ్లకు అనుమతి ఇచ్చారని, వాటిని సమీక్షించి ఒప్పందాలు అమలవుతున్నాయా లేదా చూడాల్సిన అవసరం ఉందని దామోదర రాజనర్సింహ అన్నారు. జలయజ్ఞం వంటి పథకాలను ఎందుకు సమీక్షించడం లేదని ఆయన అడిగారు. ఎవరికీ చెప్పకుండా విద్యుత్ చార్జీలను పెంచాలనే నిర్ణయం ఎలా తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలా నిలదీస్తుంటే సమన్వయ కమిటీలోని ఇతర సభ్యులు ఒకటీ, ఆరా మాటలు మాత్రమే మాట్లాడారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేసిన దామోదర రాజనర్సింహను వారంలోగా ఢిల్లీకి రావాలని ఆజాద్ ఆహ్వానించారు. వివిధ వివరాలతో తన వద్దకు రావాలని ఆయన సూచించారు. పార్టీ శానససభ్యుల్లో జగన్ వర్గానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారు, వారి నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు ఎవరెవరు ఉన్నారు, సామాజిక వర్గ సమీకరణాలు ఏమిటి అనే విషయాలతో ఢిల్లీకి రావాలని ఆయన దామోదర రాజనర్సింహకు సూచించారు.












Click it and Unblock the Notifications