జగన్ పట్ల కిరణ్ మెతక వైఖరి, కాంగ్రెసు నేతల ఫైట్

కిరణ్ కుమార్ రెడ్డిని ఎదుర్కోవడానికి తాజాగా ఆ నాయకులు కొత్త వాదనను ముందుకు తెచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పట్ల కిరణ్ కుమార్ రెడ్డి మెతక వైఖరి అవలంబిస్తున్నారనేది ఆ వాదన. ఈ విషయంపై కిరణ్ కుమార్ రెడ్డి మీద డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సమక్షంలోని కడిగి పారేయడం అందులో భాగమేనని అంటున్నారు. హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని చూపిస్తూ శంకరరావు వరుసగా ముఖ్యమంత్రిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జగన్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చారు. వీరికి ఎమ్మార్పీయస్ నేత మంద కృష్ణమాదిగ, బిసి సంఘం నాయకుడు ఆర్. కృష్ణయ్య వంటివారు కూడా తోడుగా నిలుస్తున్నారు. పార్టీలో సమన్వయ కమిటీలో వైయస్ జగన్ గురించి చర్చించకపోవడాన్ని, సోనియాను విమర్సిస్తున్నా జగన్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంత రావు కూడా అన్నారు.
నిబంధన కాకపోయినప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రికి హోం శాఖను అప్పగించడమనే సంప్రదాయం ఉంది. దామోదర రాజనర్సింహను ఉప ముఖ్యమంత్రిగా నియమించినా హోం శాఖ మాత్రం సబితా ఇంద్రా రెడ్డి వద్దనే ఉంది. ఆ శాఖ దామోదర రాజనర్సింహ చేతికి వచ్చేలా ముఖ్యమంత్రిపై, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవడమే ఆ లాబీ ఉద్దేశంగా ప్రచారం జరుగుతోంది. ఉద్దేశం ఏదైనప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెసులోని ఓ వర్గం నిర్మాణాత్మక సమరం చేస్తున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.












Click it and Unblock the Notifications