తెలంగాణలో వైయస్ జగన్ దీక్ష సాగుతుందా?

వైయస్ జగన్ నిజామాబాద్ పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ విద్యార్థి జెఎసి నాయకుడు పిడమర్తి రవి ప్రకటించారు. తెలంగాణను వంచిస్తున్నారని, రాయలసీమ గూండాలతో జగన్ నిజామాబాద్ జిల్లాకు రావాలనుకుంటున్నారని తెలంగాణ విద్యార్థి జెఎసి నాయకులు విమర్శిస్తున్నారు. జగన్‌ను అడుగడుగునా అడ్డుకుంటామని వారంటున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా మహబూబా బాద్‌లో తలపెట్టిన ఓదార్పు యాత్ర భగ్నమైన అనుభవం జగన్‌కు ఉంది. అదే పంతంతో ఆయన నిజామాబాద్ జిల్లాకు చేరుకునే ప్రయత్నం చేస్తారా అనేది కూడా చెప్పలేం. మొత్తం మీద, వైయస్ జగన్ నిజామాబాద్ జిల్లా పర్యటన అంత సులభంగా జరిగే పరిస్థితి లేదు.












Click it and Unblock the Notifications