వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ తెలంగాణ వ్యతిరేకి కాదు, అడ్డుకోవద్దు: బాజిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bajireddy
నిజామాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఆయన పర్యటనను తెలంగాణవాదులు ఎవరూ అడ్డుకోవద్దని ఆ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి ఆదివారం నిజామాబాద్‌లో అన్నారు. రైతు సమస్యల కోసమే జగన్ ఆర్మూర్‌లో దీక్ష చేస్తున్నారన్నారు. అప్పుల బాధతో తెలంగాణ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం రైతులకు పదిశాతం రుణాలు కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుది ద్వంద వైఖరి అన్నారు. ఆయనను అడ్డుకోవడంలో తప్పులేదన్నారు. తెలంగాణ ప్రాంత మనోభావాల్ని తమ పార్టీ గౌరవిస్తుందన్నారు.

కాగా ఈ నెల పదవ తేది నుండి పదమూడవ తేది వరకు తెలంగాణ జిల్లాల్లో జగన్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో ఆయన రైతుల కోసం దీక్ష చేయనున్నారు. గతంలో వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌లో ఓదార్పు యాత్ర కోసం వచ్చిన జగన్‌పై తెలంగాణవాదులు పార్లమెంటులో ఆయన వైఖరికి నిరసనగా రైల్వే స్టేషన్‌లోనే రాళ్ల దాడి చేశారు. దీంతో ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ జిల్లాల్లో పర్యటించలేదు.

English summary
YSR Congress Party leader Bajireddy Goverdhan Reddy said today that Jagan is not against to Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X