వైయస్ జగన్‌కు మాజీ తెరాస నేత గంగారెడ్డి మద్దతు

అందరం ఒకే కుటుంబానికి చెందినవారమని వైయస్ చెప్పేవారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి జగన్‌ను కూడా తాను అభిమానిస్తానని ఆయన చెప్పారు. రైతుల కోసం జగన్ చేపట్టిన దీక్షకు తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. వైయస్ జగన్ మంగళవారం ఉదయం ఆర్మూర్‌లో రైతు దీక్ష చేపట్టేందుకు బయలుదేరారు. మధ్యలో కొలను శ్రీనివాస రెడ్డి జగన్‌ను కలిసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. జగన్ మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ యాత్రను అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నించారు. రోడ్డుపై అక్కడక్కడ టైర్లు కాల్చి అడ్డంగా వేశారు.












Click it and Unblock the Notifications