హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాణహితకోసం పాదయాత్ర రాజకీయం లేదు: దేవేందర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devendar Goud
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల జాతీయ హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఈ నెల 25వ తేది నుండి పాదయాత్ర చేస్తుందని తెలుగుదేశం పార్టీ గురువారం మీడియా సమావేశంలో తెలిపింది. టిడిపి సీనియర్ నేతలు ఎర్రబెలలి దయాకర రావు, దేవేందర్ గౌడ్ ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో మాట్లాడారు. ప్రాణహిత జాతీయ హోదా కోసం 25 నుండి ఇరవై రోజుల పాటు 340 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండి అదిలాబాద్ జిల్లా ప్రాణహిత వరకు యాత్ర ఉంటుందన్నారు. గతంలో టిడిపి ప్రాణహిత కోసం ఉద్యమించిందని అయినా ప్రభుత్వంలో కదలిక లేదని అందుకే మరోసారి ఉద్యమిస్తున్నామన్నారు. ప్రాజెక్టులు కట్టి నీళ్లు పూర్తిగా ఉపయోగించుకుంటే తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నారు. 2009 ఎన్నికలకు ముందు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హడావుడిగా తెలంగాణకు నీళ్లు వస్తున్నాయని చెప్పి శంఖుస్థాపనలు చేసి టెండర్లు పిలిచారన్నారు.

సాధారణం కంటే రెట్టింపుతో టెండర్లు కట్టబెట్టి రూ.1100 కోట్లు తిన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా ప్రాజెక్టును చేపట్టాలన్నారు. 25లోగా కేంద్రం స్పందించకుంటే తమ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. పోలవరం కోసం పట్టుపడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు రావద్దనే అంతిమంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తామన్నారు. ఉప ఎన్నికలకు పాదయాత్రకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీలకతీతంగా తమకు సంఘీభావం తెలిపితే అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెసు అభివృద్ధిపై కూడా మోసం చేస్తోందన్నారు. అమరవీరుల కుటుంబాలను టిడిపి తప్పకుండా ఆదుకుంటుందన్నారు.

English summary
TTDP planned to padayatra from Chevella to Pranahitha for national status, said TDP leaders Devendar Goud and Errabelli Dayakar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X