హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలకృష్ణ వర్సెస్ జూ. ఎన్టీఆర్: ముదిరిన విభేదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna-Jr Ntr
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా నందమూరి, నారా కుటుంబాల మధ్య పెరుగుతున్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మూడు బృందాలు విడివిడిగా ఎన్టీఆర్‌కు బుధవారం నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ కాంగ్రెసు శానసభ్యుడు, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో కలిసి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ బసవతారకం మెమోరియల్ ఆస్పత్రిలో నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో విడిగా నివాళులు అర్పించారు. మరోవైపు ఎన్టీఆర్ సతీమణి కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ చంద్రబాబుకు దూరమవుతూ ప్రస్తుతం కాంగ్రెసులో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.

బాలకృష్ణ మాట్లాడిన తీరు కూడా జూనియర్ ఎన్టీఆర్‌తో దూరం పెరిగినట్లు తెలియజేస్తోంది. ఎవరి అభిప్రాయాలు వారివని, ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. తెలుగుదేశం పార్టీతోనే జూనియర్ ఎన్టీఆర్ ఉంటారని ఆయన కచ్చితంగా చెప్పలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెట్టాలనే చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగానే బాలకృష్ణ వ్యవహరిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ దూకుడును తగ్గించడానికే బాలకృష్ణ హడావిడిగా రాజకీయ ప్రకటనలు చేస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

హరికృష్ణ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ పార్టీ విషయంలో అంత ఇష్టంగా మాట్లాడినట్లు కనిపించలేదు. పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తామని చెప్పారు తప్ప చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా నిలబెడుతామని అనలేదు. సంబంధాలు మెరుగ్గా ఉన్నప్పుడు మాట్లాడిన తీరుకు ఇప్పుడు మాట్లాడిన తీరుకు ఆ తేడా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసికట్టుగా పనిచేస్తామని వారిద్దరు కూడా చెప్పారు. నందమూరి, నారా కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలు ఎంత దూరం పోతాయనేది వేచి చూడాల్సిందే.

English summary
It seems differences between Nara and Nandamuri families increased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X