హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఎమ్మెల్యేలకు న్యాయం చేస్తా: చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీలోని తెలంగాణ శాసనసభ్యులకు న్యాయం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి గురువారం అన్నారు. సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పిఆర్పీ కార్యాలయంలో వారిని సన్మానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవుల కోసం తాము అధిష్టానాన్ని ఎప్పుడూ అడగలేదన్నారు. మూడు పదవులు ఇచ్చి ఉంటే తెలంగాణకు కూడా న్యాయం జరిగేదన్నారు. తెలంగాణ నేతలకు న్యాయం చేసే దిశలో ప్రయత్నాలు కొనసాగిస్తానన్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఏ శాఖ సముచితమో అధిష్టానమే నిర్ణయించారన్నారు. తాను కాంగ్రెసులో పవర్ సెంటర్ అవుతానని భావించడం లేదని, పార్టీ మరింత బలపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఓ శక్తికి మరో శక్తి తోడైతే ఏమైనా సాధించవచ్చునన్నారు.

తన వర్గం నేతలకు పదవులు ఇచ్చినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసును అధికారంలోకి తీసుకు రావడానికి అందరం కలిసి కట్టుగా పని చేస్తామన్నారు. తాను, పిఆర్పీ నేతలు కాంగ్రెసు బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు.

English summary
I will try for Telangana mlas posts, said Tirupati mla Chiranjeevi today in PRP office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X