కార్తీక్ తనే శిక్షించుకుంటున్నాడు:శంకర్రావుపై సబిత ఫైర్

మంత్రి శంకర రావు ఉద్దేశ్య పూర్వకంగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏ పాపం ఎరుగని తన కుమారుడు కార్తీక్ రెడ్డిపై ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దీంతో మనస్తాపం చెందిన కార్తీక్, సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని, ఇంట్లోనే ఉంటూ తనను తానే శిక్షించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమయం వచ్చినప్పుడు గట్టిగా ప్రతిస్పందిస్తానని హెచ్చరించారు. కాగా శంకర రావు సబితా రెడ్డి, ఆమె తనయుడుపై ఇటీవల తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications