కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విధులకు ఆటంకం కేసు: సి.రామచంద్రయ్యకు ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
కడప: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్న శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్యకు బుధవారం మరో ఊరట లభించింది. ఆయనపై పెట్టిన ఓ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఐతే ఇందుకు సంబంధించిన పత్రాలు కోర్టుకు అందడంలో జాప్యం జరగడంతో తీర్పును 30వ తేదీకి వాయిదా వేసింది. వివరాల ప్రకారం... సి.రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇరవై మందిపై 2006వ సంవత్సరంలో ఓ కేసు నమోదైంది. రాజంపేటలో రోడ్ల విస్తరణలో భాగంగా ఓ భవనం కూలిపోవడంతో పదిమంది మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి అప్పుడు రామచంద్రయ్య, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై అప్పటి ఏఎస్పి లక్ష్మీ రెడ్డి, రామచంద్రయ్యతో పాటు ఇతర నేతలపై కేసు పెట్టారు.

ఇదే కేసులో బుధవారం రాజంపేట కోర్టుకు రామచంద్రయ్య హాజరు కావాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుంది. ఉపసంహరణకు సంబంధించిన పత్రాలు కోర్టుకు అందకపోవడం, రామచంద్రయ్య కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ప్లీడరు ద్వారా కోర్టుకు ఆ పత్రాలను అందజేసింది. ఐతే అప్పటికే సమయం మించిపోవడంతో తుదితీర్పును 30కి వాయిదా వేశారు.

English summary
State government withdrew petition on MLC C Ramachandraiah on wednes day, which is put against him in Rajampet court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X