వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్స్‌లో కోనేరు ప్రసాద్‌కు చికిత్స: కోర్టు అనుమతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Koneru Prasad
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయిన కోనేరు ప్రసాద్‌కు హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చికిత్సకు హైదరాబాదు నాంపల్లి కోర్టు అనుమతించింది. తనకు కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని కోరుతూ కోనేరు ప్రసాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై వాదోపవాదాలు జరిగాయి. కోనేరు ప్రసాద్‌కు కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్సకు అనుమతించవద్దని, నిమ్స్‌లో చికిత్స చేయిస్తే సరిపోతుందని సిబిఐ వాదించింది. దాంతో నిమ్స్‌లో చికిత్సకు కోనేరు ప్రసాద్‌ను కోర్టు అనుమతించింది.

ఇదిలా ఉంటే, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో తుమ్మల రంగారావు ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న సునీల్ రెడ్డిని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులోనూ సిబిఐ విచారించినట్లు సమాచారం. సునీల్ రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో సిబిఐ సోదాలు మంగళవారం ముగిశాయి. సునీల్ రెడ్డికి చెందిన ల్యాప్‌టాప్‌ను, కీలక పత్రాలను సిబిఐ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఎమ్మార్ కేసుతో తనకు ఏ విధమైన సంబంధం లేదని స్టైలిష్ హోమ్స్ అధినేత రంగారావు చెప్పారు. తనను అరెస్టు చేసేందుకు సిబిఐ ప్రయత్నం చేస్తోందని చెబుతూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. తాను సిబిఐ విచారణకు సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 9వ తేదీన తన వాంగ్మూలాన్ని సిబిఐ రికార్డు చేసిందని ఆయన చెప్పారు.

English summary
Court has permited Koneru Prasad, arrested in EMAAR propertoes case, to get treatment at NIMS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X