హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హింస, లా & ఆర్డర్ అభివృద్ధికి అడ్డు కావొద్దు: గవర్నర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narasimhan
హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతల సమస్య, హింస ఆటంకం కాకూడదని గవర్నర్ నరసింహన్ గురువారం అన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఆయన గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతిని అరికట్టి పారదర్శకంగా పథకాలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆయన మూడు భాషల్లో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. కాగా గణతంత్ర దినోత్సవంలో వివిధ శాఖల శకటాలు కనువిందు చేశాయి. కార్మిక శాఖ శకటానికి మొదటి బహుమతి, అటవీ శాఖ శకటానికి రెండో బహుమతి, రాజీవ్ స్వగృహ కల్ప శకటానికి మూడో బహుమతి వచ్చింది.

గాంధీ భవన్‌లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలు లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు చేసే రోజు ఇది అన్నారు. అణగారిన వర్గాలకు అన్ని విధాలా కాంగ్రెసు అండగా ఉంటుందని చెప్పారు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మెదక్‌లోని రాందాస్ చౌరస్తాలో జెండాను ఎగురవేశారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి నారాయణ జెండా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసానికి కాంగ్రెసు అంతర్గత కుమ్ములాటలే కారణమన్నారు. దానికి వారే నైతిక బాధ్యత వహించాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గురజాలలో జెండాను ఎగురవేశారు.

English summary
Governor Narasimhan hausted national flag at parade grounds on republic day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X