వేరే దేశాల్లో అయితే కాల్చేసేవారే: జగన్‌పై రేవంత్

Revanth Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన అవినీతి ఇతర దేశాల్లో జరిగి ఉంటే కాల్చేసేవారేనని ఆయన అన్నారు. తనపై ఇన్ని విచారణలు వేసే బదులు తమ కుటుంబాన్ని కాల్చి చంపొచ్చు కదా.. అంటూ వై.ఎస్.జగన్మోహన రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆ విధంగా అన్నారు. "కానీ.. భారతదేశంలో ఎంత అవినీతికి పాల్పడినా ఏడెనిమిది సంవత్సరాలకన్నా ఎక్కువ శిక్ష పడదు. అది జగన్ అదృష్టం'' అని అన్నారు. "సీబీఐ అరెస్ట్ చేసిన సునీల్ రెడ్డి తన బంధువని జగనే పలుమార్లు చెప్పుకొన్నారు. ఆయన భజన పత్రికలోనే ఆ వార్తలు ప్రచురితమయ్యాయి. కానీ.. ఇప్పుడేమో జగన్ అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. తనకు జైలు తప్పదని అర్థమైనందునే జగన్‌కు కాళ్లు వణుకుతున్నాయి'' అని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ఇతరులకూ బురద అంటించేందుకు జగన్ యత్నిస్తున్నారని, చంద్రబాబుపై కూడా ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.

నేరాలన్నీ ఒప్పుకొని నాటి సత్యం కంప్యూటర్స్ అధిపతి రామలింగరాజు లొంగిపోయినట్లుగానే తన తప్పుల చిట్టా రాసి ఒక ప్రతిని ప్రజలకు, మరో ప్రతిని పోలీసులకు అందించి, అటుపై సీబీఐకి లొంగిపోతే మంచిదని ఆయన జగన్‌కు సూచించారు. చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డాడంటూ వరంగల్ జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా.. "ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు. చంద్రబాబుపై జగన్ నేరుగా పోరాడవచ్చు. అంతే తప్ప వరంగల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎల్లారెడ్డి అనే వ్యక్తి ముసుగులో కేసు దాఖలు చేయడమెందుకు ? అయినా.. చంద్రబాబు ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని ఇదే తరహా పిటిషన్లపై హైకోర్టు, సుప్రీం కోర్టులే అభిప్రాయపడ్డాయి కదా?'' ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+