వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనేరు ప్రసాద్ తనయుడు మధు విచారణ వదంతులే

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI Logo
గుంటూరు : ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో కోనేరు ప్రసాద్ తనయుడు కోనేరు మధును విచారించినట్లు వచ్చిన వార్తలు ఊహాగానాలేనని తేలిపోయింది. శుక్రవారం సాయంత్రం తెలుగు టీవీ చానెళ్లు హడావిడిగా కోనేరు మధును సిబిఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోందంటూ వార్తలను గుప్పించాయి. అయితే, అందులో నిజం లేదని కోనేరు ప్రసాద్ కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు. కోనేరు మధును పోలిన వ్యక్తి దిల్‌కుషా అతిథిగృహంలో సిబిఐ అధికారుల వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో అతడ్ని కోనేరు మధుగా భావించి టీవీ చానెళ్లు వార్తాకథనాలను ప్రసారం చేశాయని అంటున్నారు. ఆ తర్వాత ఆ వార్తాకథనాన్ని చడీచప్పుడు లేకుండా నిలిపేశాయి.

కోనేరు ప్రసాద్‌కు ఇద్దరు కొడుకులు. మధు దుబాయ్‌లో ఉంటున్నారు. దీంతో సిబిఐ ప్రధానంగా ఈయన పైనే దృష్టి సారించింది. ఎమ్మార్ కేసులో దుబాయ్‌లో ఉంటున్న మధు ఖాతాలోకి నిధులు మళ్లించారని సిబిఐ అనుమానిస్తోంది. ఇటీవల సునీల్ రెడ్డి అరెస్టు సైలెంట్‌గా జరిగింది. ఆయనను రెండు రోజుల పాటు విచారించిన సిబిఐ ఆ తర్వాత అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో కోనేరు ప్రసాద్‌ను కూడా సిబిఐ చడీచప్పుడు లేకుండా రప్పించిందని మీడియా భావించింది. కానీ అది తప్పుగా తేలిపోయింది. కాగా గతంలో పలుమార్లు కోనేరు మధుకు సిబిఐ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన నుండి ఎలాంటి స్పందన లేదు.

English summary
It is clarified that CBI has not grilled Loneru Prasad's son Koneru Madhu, who is in dubai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X