వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ముందుకు అజయ్ మిశ్రా

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI Logo
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ ఎదుట సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా గురువారం ఉదయం హాజరయ్యారు. అజయ్ మిశ్రాను సిబిఐ అధికారులు రెండు గంటల పాటు విచారించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు, మౌలిక వసతుల ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అజయ్ మిశ్రా ప్రస్తుతం సెక్రటేరియెట్‌లోని సాధారణ పరిపాలనా శాఖ (జీఐడీ) లో పొలిటికల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అలాగే జగతి పబ్లికేషన్స్‌కు ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

అలాగే, గనుల అక్రమ తవ్వకం కేసులకు సంబంధించి గనుల వ్యాపారి శశికుమార్ గురువారం ఉదయం సిబిఐ కార్యాలయానికి వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ సిఎస్ రమాకాంత్ రెడ్డి కూడా సిబిఐ ఎదుట హాజరయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. చీఫ్ సెక్రటరీగా ఆయన పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. అలాగే, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు బావమరిది పార్థసారథిని కూడా సిబిఐ విచారించే అవకాశాలున్నాయి. పార్థసారథి ఎపిఐఐసి డైరెక్టరుగా పనిచేశారు.

English summary
IAS officer Ajay Misra deposed before CBI today in YSR Congress president YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X