ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎస్మా రెడ్డే: కెసిఆర్

లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడం లేదని ఆయన అన్నారు. తలా తోక ఉన్న ప్రభుత్వమా, లేని ప్రభుత్వమా అని ఆయన అడిగారు. చంద్రబాబు కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశపెట్టారని, అందరు దాన్ని కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. కాంట్రాక్టు ముఖ్యమంత్రిని, కాంట్రాక్టు మంత్రులను పెడితే ప్రభుత్వం ఇంత కన్నా బాగా నడుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాగానే కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణలో సాగు భూములకు నీళ్లు ఇవ్వడం లేదని, నగరం వచ్చి ఆటోలు నడుపుదామంటే రావద్దని చెబుతున్నారని ఆయన అన్నారు. ఆందోళనలతో రాష్ట్రం నలుమూలలా తగులబడుతోందని ఆయన అన్నారు. తెలంగాణ సాధనే తమ ఏకైక లక్ష్యమని ఆయన అన్నారు. పత్రికలు, చానెళ్లు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయని, ఎవరు ఏం ప్రచారం చేసినా తమను ఏమీ చేయలేరని, మళ్లీ పెద్ద యెత్తున ఉద్యమిద్దామని, కార్యాచరణ రూపొందిస్తామని ఆయన అన్నారు. మార్చిలో ఉద్యమం పెంచితే విద్యార్థులకు ఇబ్బందులకు కలుగుతాయని, అందువల్ల ఉద్యమం ఏ సమయంలో ఉండాలనే ఆలోచన సాగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం మరోసారి జూలు దులుపుదామని ఆయన అన్నారు. ముందుకు సాగుదాం, తెలంగాణ సాధిద్దాం, ఆత్మగౌరవంతో బతుకుదామని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications