జగన్‌వర్గం శోభా నాగి రెడ్డి కౌంటర్‌పై వంగా గీత కామెంట్

 Vanga Geetha
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డిపై వేటు వేయాలని ఆ పార్టీ చీప్ విప్ వంగా గీత గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. శోభా నాగి రెడ్డి విషయమై గీత ఉదయం స్పీకర్ ఎదుట హాజరయ్యారు. తమ వాదనలను వినిపించారు. సాక్షిగా ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ హాజరయ్యారు. అనంతరం గీత మీడియాతో మాట్లాడారు. శోభా నాగి రెడ్డిపై వేటు వేయాలని తాము స్పీకర్‌ను కోరామని చెప్పారు. తమ వాదనలు వినిపించామని ఆమె చెప్పారు. ఆమెపై వేటుకు పూర్తి సాక్ష్యాధారాలను అందజేశామన్నారు. ఆమె కౌంటర్ కూడా సరిగా వేయలేదన్నారు. కాంగ్రెసులో పిఆర్పీ విలీనంపై స్పీకర్‌దే తుది నిర్ణయమన్నారు.

వేటు వేయమని పిఆర్పీ, రాజీనామా ఆమోదించమని శోభా నాగి రెడ్డి కోరుతున్న నేపథ్యంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కాగా అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు కాపు రామచంద్ర రెడ్డి వేటు విషయమై కాంగ్రెసు పార్టీ చీఫ్ విప్ కొండ్రు మురళీ మోహన్ స్పీకర్‌ను కలవనున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో తనకు ఎలాంటి విప్ అందలేదని కాపు చెబుతున్నందున, కొండ్రు అందుకు తగిన సాక్ష్యాలు చూపించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+