విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్‌కో న్యాయం, బాబుకు మరో న్యాయమా?: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
విశాఖపట్నం: చనిపోయిన వైయస్ రాజశేఖర రెడ్డికి ఓ న్యాయం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరో న్యాయమా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం విశాఖపట్నం జిల్లాలో ప్రశ్నించారు. ఆయన విశాఖలో పర్యటిస్తున్నారు. పెదవాల్తేరులో ఆయన దివంగత వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెసు, టిడిపిలు ప్రజా సమస్యలు గాలికొదిలాయని ఆరోపించారు. కాంగ్రెసు నేతలు వైయస్ బతికున్నప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడు మాత్రం చంద్రబాబుతో కుమ్మక్కై ఆయనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైయస్ రెక్కల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెసు, కేంద్రంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యమేలుతోందన్నారు. వైయస్ ఎక్కడకూ పోలేదని ఆయన ప్రతి గుండెల్లో ఉన్నారన్నారు. వైయస్ తర్వాత ప్రజలను పట్టించుకున్న నేత లేడన్నారు. జూనియర్ డాక్టర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డెక్కిన పట్టించుకున్న వారు లేరన్నారు.

వైయస్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెసు, ఆ పార్టీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏమూల చూసినా దీక్షలు, ఆందోళనలే అన్నారు. రైతులు వ్యవసాయం కంటే ఉరి వేసుకోవడం మంచిదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దెలపాలెంలో ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అమలాపురం ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్యే గొల్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy questioned about seperate justice to TDP chief Nara Chandrababu Naidu and late YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X